Mana Doctor Babe movie: శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కించిన చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ సినిమా ద్వారా శ్రీ స్కంద హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 20న విడుదలైంది. కుటుంబ సమేతంగా చూసేలా వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

Mana Doctor Babe movie: కథ
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజు (శ్రీ స్కంద) పట్ల మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల)కు అంతగా సదభిప్రాయం ఉండదు. తన కూతురు సింధు (శృతి శంకర్)ను ఇచ్చి పెళ్లి చేయాలంటే డాక్టర్ కావాలనే షరతు విధిస్తాడు. మరదలి కోసం కష్టపడి డాక్టర్ అయినా.. ‘ఆండ్రాలజిస్ట్’ అనే ట్యాగ్ చూసిన తర్వాత ఆ పేరు తీసేస్తేనే పెళ్లి చేస్తానని దుర్గారావు మరో కండీషన్ పెడతాడు. అయితే రాజు మాత్రం తన వృత్తి విషయంలో వెనక్కి తగ్గడు. అసలు రాజు ఆండ్రాలజిస్ట్‌గా ఎందుకు మారాడు? ఈ ప్రయాణంలో గౌతమి (మోహన సిద్ధి), డాక్టర్ సుఖం (అలీ), తాత రత్నం (కోటేశ్వరరావు) పాత్రలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
బావ-మరదలు, మేనమామ-అల్లుడు అనుబంధాల నేపథ్యంలో సాగే సహజమైన కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్టాఫ్‌లో ఆండ్రాలజిస్ట్ చుట్టూ అల్లుకున్న సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ వద్ద వచ్చే షరతు తర్వాత సినిమా ఎమోషనల్ టోన్‌లోకి మారడం కథకు బలాన్ని ఇచ్చింది. తీసుకున్న కాన్సెప్ట్‌ను హద్దు దాటకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎవరూ ఇబ్బంది పడని విధంగా హ్యాండిల్ చేసిన తీరు బాగుంది. క్లైమాక్స్‌లోని ట్విస్ట్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తొలి సినిమా అయినప్పటికీ శ్రీ స్కంద కామెడీ, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో సులువుగా ఒదిగిపోయారు. మోహన సిద్ధి, శృతి శంకర్ తమ లుక్స్‌తో పాటు పాత్రలకు తగిన ప్రాధాన్యతతో మెప్పించారు. రాజీవ్ కనకాల, కోటేశ్వరరావు మేనమామ, తాత పాత్రల్లో ఎమోషనల్‌గా ఆకట్టుకోగా, సెకండాఫ్‌లో అలీ కామెడీ ప్రేక్షకులకు నవ్వులు పంచింది.
సాంకేతిక అంశాలు.. తుది తీర్పు
కిషోర్ బోయిడపు విజువల్స్, మనోజ్ కుమార్ సంగీతం, సెల్వ కుమార్ ఎడిటింగ్, రామకృష్ణ గరగ కథ, అర్థవంతమైన పాటలు, మాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. మొత్తంగా కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిసిన క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ‘మన డాక్టర్ బాబే’ నిలుస్తుంది.