Telangana SI Hall Ticket Download: తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) హాల్ టికెట్లను ఆదివారం నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ హాల్ టికెట్లను ఈ నెల 28వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకునే వీలుందని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాలు మరియు అభ్యర్థుల సంఖ్య
రాష్ట్రంలో మొత్తం 275 ఎస్సై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, సుమారు 1.60 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి కోసం ఈ నెల 29వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 335 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.