న్యూఢిల్లీ : భారత యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శనివారం అధికారికంగా బీజేపీలో చేరారు. చాహల్‌ను బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించారు. బీజేపీలో చేరడానికి ముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో చాహల్ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. చాహల్ రాకతో యువతలో ముఖ్యంగా ఓబీసీలో బీజేపీకి బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. చాహల్ ఇండియా తరఫున అనేక మ్యాచ్‌ల్లో ఆడాడు.
బీజేపీలో చేరిన క్రికెటర్ యజ్వేంద్ర చాహల్