న్యూయార్క్ : అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్ ఖాతాదారులకు సంబంధించిన కొంత సమాచారం సైబర్ దాడి బారినపడింది. ఈ మూడు సంస్థలకు సేవలందించే థర్డ్ పార్టీ సంస్థలపై హ్యాకర్లు దాడి చేసినట్లు వెల్లడైంది.
జేపీ మోర్గాన్ ఖాతాదారుల పేర్లు, ఈ మెయిల్ చిరునామాలతో కూడిన మార్కెటింగ్ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని తెలిపింది. మాస్టర్ కార్డ్ ప్రత్యేక ప్రయోజన పథకంలో ఉన్న కొందరు ఖాతాదారుల ఈ మెయిల్ వివరాలు బయటపడినట్లు పేర్కొంది.