- మరణశిక్ష పడినా వెనక్కి తగ్గని మాజీ ప్రధాని
PNB News, 24 నవంబర్ 2026: న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆమె డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అధికార ప్రతినిధి తెలిపారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 16న స్వదేశానికి వెళ్లాలని హసీనా భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఢాకాకు తన ప్రయాణానికి బంగ్లాదేశ్ జాతీయ విమానయాన సంస్థ ద్వారా ఏర్పాట్లు చేయాలని ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఉద్యమం నేపథ్యంలో 2024 ఆగస్టు 5న హసీనా తన 15 ఏండ్ల పాలనకు ముగింపు పలికి భారత్‌కు వచ్చారు. ఉద్యమ సమయంలో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి హసీనాపై కేసు నమోదైంది. బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా తిరస్కరించారు. స్వదేశానికి తిరిగొచ్చాక న్యాయపోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగొస్తే అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. ఆమెకు మరణశిక్షపై అప్పీల్ చేసేందుకు గడువు ముగిసిందని తెలిపింది.