షేర్: f 𝕏 ✉ ✈ in @
pnbnews.in 21 నవం 2026, 4:10 సా.
వినోదం

కర్నూలులో రికార్డ్.. మలేషియాలో అప్‌లోడ్.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్ టు హోమ్ సినిమా..!

Telugu news from Telangana and Andhra Pradesh
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 4:10 సా. రచన: One News Desk
11 వీక్షణలు 0 వ్యాఖ్యలు
కర్నూలులో రికార్డ్.. మలేషియాలో అప్‌లోడ్.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్ టు హోమ్ సినిమా..!

మధ్యతరగతి కుటుంబానికున్న ఒక్కగానొక్క రంగుల కల ఏంటంటే ఇంకేంటి సినిమానే. కానీ, అది మసకబారి చాలా రోజులే ఐంది. బలమైన మాస్ మీడియా అనుకున్న సినిమా మాధ్యమానికి చెదలు పట్టి చాన్నాళ్లే ఐంది. కరోనా రక్కసి వెక్కిరించి, లాక్‌డౌన్‌ రెవెల్యూషన్‌తో సగానికి సగం చిక్కిపోయిన సినిమా పరిశ్రమ.. ఓటీటీ విప్లవానికి పూర్తిగా సరెండరైంది. కొంత గ్యాప్ తర్వాత ఆడియన్స్‌ కూడా బ్యాక్‌ టు థియేటర్స్ అనడంతో సినిమాకు లైఫ్ వచ్చినట్టయింది. వరసబెట్టి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజౌతున్నాయి, ఇంకేముంది.. సినిమాకు పూర్వ వైభవం వచ్చినట్టేగా అనుకున్నారు. కానీ, సగటు సినిమాకు ఆగర్భ శత్రువు ఒక్కడున్నాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడు. సినిమాను బతకనిచ్చేదే లేదని నల్లముసుగేసుకుని నక్కి కూర్చున్నాడు. అవును, సినిమాను మళ్లీ బెదరగొట్టడం మొదలుపెట్టాడు పైరసీ మాయగాడు.
శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా తీసేవాళ్లకీ, సినిమా చూసేవాళ్లకీ ఉమ్మడిగా పండగొచ్చినట్టే..! ఒకటీ రెండూ కాదు ఒక్కోసారి అరడజను సినిమాలొచ్చి మీద పడిపోతాయి. తియ్యటి దండయాత్ర షురూ చేస్తాయి. కానీ, మీకే కాదు, మాకూ గుడ్‌ఫ్రైడేనే అని శుక్రవారం కోసం కళ్లు కాయలయ్యేలా వెయిటింగ్‌లో ఉంటున్నారు అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉన్న పైరసీ మాయగాళ్లు. కొన్ని రోజులుగా గ్యాప్ ఇచ్చినట్టు కనిపించినా, మళ్లీ జడలు విప్పి, ఒరిజినల్ ఇండస్ట్రీకే సవాల్ విసురుతోంది పైరసీ ఇండస్ట్రీ.
నిన్నమొన్నే బిగ్‌స్క్రీన్‌ని టచ్ చేసిన ఆకాశంలో ఒక తార..! చిన్న బడ్జెట్ సినిమానే అయినా, మూడు ప్రిస్టీజియస్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని,...

#వినోదం #కర్నూలు
మధ్యతరగతి కుటుంబానికున్న ఒక్కగానొక్క రంగుల కల ఏంటంటే ఇంకేంటి సినిమానే. కానీ, అది మసకబారి చాలా రోజులే ఐంది. బలమైన మాస్ మీడియా అనుకున్న సినిమా మాధ్యమానికి చెదలు పట్టి…