న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం ప్రతిపాదనకు వ్యతిరేకంగా డిసెంబర్ 3న సమ్మెకు దిగనున్నట్టు మూడు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి.
ఐడీబీఐ బ్యాంక్‌లో 60 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన సుమారు 2.5 లక్షల మంది సిబ్బంది గురువారం సమ్మెకు పిలుపునిచ్చారు.