షేర్: f 𝕏 ✉ ✈ in @
pnbnews.in 18 నవం 2026, 9:56 సా.
ఆంధ్రప్రదేశ్

Sankranti Special Trains : సంక్రాంతి, శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి మంగళూరుకు స్పెషల్ ట్రైన్స్..

అయ్యప్ప భక్తులు, సంక్రాంతి ప్రయాణికులకు ఊరట రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. జనవరి వరకు ప్రత్యేక సర్వీసులు Sankranti Special Trains :…
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 9:56 సా. రచన: oneadmin
4 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Sankranti Special Trains : సంక్రాంతి, శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి మంగళూరుకు స్పెషల్ ట్రైన్స్..
  • అయ్యప్ప భక్తులు, సంక్రాంతి ప్రయాణికులకు ఊరట
  • రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్..
  • జనవరి వరకు ప్రత్యేక సర్వీసులు

Sankranti Special Trains : సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది.. మరోవైపు శబరిమలకు అయ్యప్ప భక్తుల ప్రయాణాలు కూడా ఊపందుకుంటున్నాయి. దీంతో రైళ్లలో రద్దీ రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లు దొరకడం కాస్త కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది.. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయంటే?

జనవరి వరకు ప్రత్యేక రైళ్లు :
దక్షిణ మధ్య రైల్వే ప్రకారం.. హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (07097) డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం ఈ రైలు ప్రయాణికులకు సర్వీసులను అందిస్తుంది. ఈ కాలంలో మొత్తం 9 ట్రిప్పులు నడపనున్నారు.

Read Also : Online Shopping New Rules : కేంద్రం కొత్త రూల్స్.. ఆన్‌లైన్ ఆఫర్లు చూసి మోసపోతున్నారా? ఇక ఈ-కామర్స్ కంపెనీల ఆటలు సాగవు!

అలాగే, తిరుగు ప్రయాణంలో మంగళూరు సెంట్రల్ – హైదరాబాద్ ప్రత్యేక రైలు (07098) డిసెంబర్ 3 నుంచి జనవరి 28 వరకు నడుస్తుంది. ప్రతి గురువారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కూడా మొత్తం 9 సర్వీసులను నడపనుంది.

ఈ స్టేషన్లలో ఆగుతుంది :
ఈ ప్రత్యేక రైళ్లు 2 తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఉపయోగపడేలా పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి. బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ సహా పలు స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్టులు ఉన్నాయి.

అన్ని తరగతుల ప్రయాణికులకు ఛాన్స్ :
ఈ రైళ్లలో జనరల్, స్లీపర్‌తో పాటు ఏసీ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సంక్రాంతి సెలవులు, అయ్యప్ప స్వామి దర్శనాల కోసం ప్రయాణం ప్లాన్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రయాణానికి ముందు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో తేదీలు, సమయాలు, టికెట్ల లభ్యతను తప్పనిసరిగా చెక్ చేయండి..

#ఆంధ్రప్రదేశ్ #భక్తి #హైదరాబాద్ #తెలంగాణ
అయ్యప్ప భక్తులు, సంక్రాంతి ప్రయాణికులకు ఊరట రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. జనవరి వరకు ప్రత్యేక సర్వీసులు Sankranti Special Trains : సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది..…