PNB News
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• బ్రేకింగ్ న్యూస్
• టాప్ స్టోరీస్
• ట్రెండింగ్
• లైవ్ అప్‌డేట్స్
• ఎక్స్‌క్లూజివ్
• ప్రత్యేక కథనాలు
• టెక్నాలజీ
• కృత్రిమ మేధస్సు
• మొబైల్ ఫోన్లు
• గాడ్జెట్స్
• యాప్స్
• ఇంటర్నెట్
• సాఫ్ట్‌వేర్
• హార్డ్‌వేర్
• సైబర్ సెక్యూరిటీ
• టెలికాం
• సోషల్ మీడియా
• ఆటోమొబైల్
• కార్లు
• బైక్స్
• ఎలక్ట్రిక్ వాహనాలు
• కమర్షియల్ వాహనాలు
• ఆటో రివ్యూలు
• ఆటో లాంచ్‌లు
• ఆటో పరిశ్రమ
• క్రీడలు
• క్రికెట్
• ఐపీఎల్
• ఫుట్‌బాల్
• టెన్నిస్
• బ్యాడ్మింటన్
• కబడ్డీ
• హాకీ
• వాలీబాల్
• అథ్లెటిక్స్
• ఒలింపిక్స్
• చెస్
• ఇతర క్రీడలు
• వినోదం
• టాలీవుడ్
• బాలీవుడ్
• హాలీవుడ్
• కోలీవుడ్
• శాండల్‌వుడ్
• OTT
• మూవీ రివ్యూలు
• టీవీ షోలు
• సెలబ్రిటీలు
• సంగీతం
• ట్రైలర్లు
• బాక్స్ ఆఫీస్
• ఆరోగ్యం
• ఆరోగ్య చిట్కాలు
• వైద్య వార్తలు
• ఆసుపత్రులు
• ఫిట్‌నెస్
• యోగా
• పోషకాహారం
• మానసిక ఆరోగ్యం
• మహిళల ఆరోగ్యం
• శిశు ఆరోగ్యం
• వ్యాధులు
• విద్య
• స్కూల్ విద్య
• ఇంటర్మీడియట్
• డిగ్రీ
• ఉన్నత విద్య
• విశ్వవిద్యాలయాలు
• విదేశీ విద్య
• పరీక్షలు
• ఫలితాలు
• స్కాలర్షిప్లు
• అడ్మిషన్లు
• ఉద్యోగాలు
• ప్రభుత్వ ఉద్యోగాలు
• ప్రైవేట్ ఉద్యోగాలు
• బ్యాంక్ ఉద్యోగాలు
• రైల్వే ఉద్యోగాలు
• రక్షణ ఉద్యోగాలు
• పోలీస్ ఉద్యోగాలు
• టీచింగ్ ఉద్యోగాలు
• IT ఉద్యోగాలు
• వాక్-ఇన్‌లు
• వ్యవసాయం
• రైతు వార్తలు
• పంటలు
• వ్యవసాయ సలహాలు
• సేంద్రీయ వ్యవసాయం
• ఉద్యానవనం
• పశుసంవర్ధక
• పాడి
• కోళ్ళ పరిశ్రమ
• చేపల పెంపకం
• మార్కెట్ ధరలు
• ఆధ్యాత్మికం
• దేవాలయాలు
• భక్తి
• జ్యోతిష్యం
• రాశిఫలాలు
• వాస్తు
• పండుగలు
• తీర్థయాత్రలు
• మత వార్తలు
• లైఫ్ స్టైల్
• ఫ్యాషన్
• అందం
• ఆహారం
• వంటలు
• ట్రావెల్
• సంబంధాలు
• మహిళలు
• పిల్లల పెంపకం
• హోమ్ & లివింగ్
• సైన్స్
• అంతరిక్షం
• ISRO
• పరిశోధనలు
• ఆవిష్కరణలు
• ఆవిష్కరణ సమాచారం
• పర్యావరణం
• పర్యావరణం
• వాతావరణ మార్పులు
• కాలుష్యం
• వన్యప్రాణులు
• అడవులు
• నీటి వనరులు
• సంరక్షణ
• పర్యాటకం
• ఆంధ్ర పర్యాటకం
• తెలంగాణ పర్యాటకం
• భారత పర్యాటకం
• అంతర్జాతీయ పర్యాటకం
• వారసత్వ స్థలాలు
• హిల్ స్టేషన్లు
• వైరల్
• వైరల్ వీడియోలు
• సోషల్ మీడియా ట్రెండ్లు
• మీమ్స్
• ఫన్నీ వార్తలు
• ఆసక్తికర వార్తలు
• అభిప్రాయం
• సంపాదకీయం
• అభిప్రాయం
• కాలమ్‌లు
• విశ్లేషణ
• నిపుణుల అభిప్రాయాలు
• ప్రత్యేక నివేదికలు
• దర్యాప్తు కథనాలు
• మైదాన నివేదికలు
• వివరణలు
• రాజకీయాల వివరణ
• ఆర్థిక వ్యవస్థ వివరణ
• వ్యాపార వివరణ
• స్టాక్ మార్కెట్ వివరణ
• టెక్నాలజీ వివరణ
• ఏఐ వివరణ
• సైన్స్ వివరణ
• అంతరిక్ష వివరణ
• ఆరోగ్య వివరణ
• విద్య వివరణ
• చట్టాల వివరణ
• రాజ్యాంగ వివరణ
• సుప్రీంకోర్టు వివరణ
• ప్రభుత్వ పథకాల వివరణ
• బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
• పన్నుల వివరణ
• బీమా వివరణ
• వాతావరణ మార్పుల వివరణ
• పర్యావరణ వివరణ
• వ్యవసాయ వివరణ
• అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
• రక్షణ రంగ వివరణ
• ఎన్నికల వివరణ
• చరిత్ర వివరణ
• మతాల వివరణ
• అపోహలు vs నిజాలు
• ఫ్యాక్ట్ చెక్
• తరచుగా అడిగే ప్రశ్నలు
• విజువల్ వివరణలు
• ఇన్ఫోగ్రాఫిక్స్
• వీడియో వివరణలు
• విజయ గాథలు
• మానవ జీవన కథలు
• ఫ్యాక్ట్ చెక్
• రాజకీయ ఫ్యాక్ట్ చెక్
• వైరల్ ఫ్యాక్ట్ చెక్
• నకిలీ వార్తల ధృవీకరణ
• NRI వార్తలు
• అమెరికా NRI
• గల్ఫ్ NRI
• యూరప్ NRI
• విదేశీ ఉద్యోగాలు
• వలస
• రక్షణ
• భారత సైన్యం
• భారత నావికాదళం
• భారత వైమానిక దళం
• సరిహద్దు భద్రత
• రక్షణ టెక్నాలజీ
• న్యాయం & న్యాయస్థానాలు
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• న్యాయ వార్తలు
• తీర్పులు
• PIL
• మహిళ
• మహిళా సాధికారత
• మహిళా ఆరోగ్యం
• మహిళా భద్రత
• మహిళా పారిశ్రామికవేత్తలు
• యువత
• కెరీర్ మార్గదర్శకం
• నైపుణ్య అభివృద్ధి
• స్టార్టప్‌లు
• విద్యార్థి వార్తలు
• General
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• పార్వతీపురం మన్యం
• విశాఖపట్నం
• అనకాపల్లి
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
PNB NewsPNB News
అక్షర పరిమాణంAa
• హోమ్
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
శోధన
• హోమ్
• ఇతరాలు
• తాజా వార్తలు
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం
• విద్య
• ఉద్యోగాలు
• వ్యవసాయం
• ఆధ్యాత్మికం
• లైఫ్ స్టైల్
• సైన్స్
• పర్యావరణం
• పర్యాటకం
• వైరల్
• అభిప్రాయం
• ప్రత్యేక నివేదికలు
• ఫ్యాక్ట్ చెక్
• NRI వార్తలు
• రక్షణ
• న్యాయం & న్యాయస్థానాలు
• మహిళ
• యువత
• General
• ఆంధ్రప్రదేశ్
• శ్రీకాకుళం
• విజయనగరం
• పార్వతీపురం మన్యం
• విశాఖపట్నం
• అనకాపల్లి
• అల్లూరి సీతారామరాజు
• కాకినాడ
• కోనసీమ
• తూర్పు గోదావరి
• పశ్చిమ గోదావరి
• ఏలూరు
• కృష్ణా
• ఎన్టీఆర్
• గుంటూరు
• బాపట్ల
• పల్నాడు
• ప్రకాశం
• నెల్లూరు
• కర్నూలు
• నంద్యాల
• అనంతపురం
• శ్రీ సత్యసాయి
• కడప
• అన్నమయ్య
• చిత్తూరు
• తిరుపతి
• తెలంగాణ
• ఆదిలాబాద్
• భద్రాద్రి కొత్తగూడెం
• హనుమకొండ
• హైదరాబాద్
• జగిత్యాల
• జనగాం
• జయశంకర్ భూపాలపల్లి
• జోగులాంబ గద్వాల్
• కామారెడ్డి
• కరీంనగర్
• ఖమ్మం
• కుమురం భీం
• మహబూబాబాద్
• మహబూబ్‌నగర్
• మంచిర్యాల
• మెదక్
• మేడ్చల్
• ములుగు
• నాగర్‌కర్నూల్
• నల్గొండ
• నారాయణపేట
• నిర్మల్
• నిజామాబాద్
• పెద్దపల్లి
• రాజన్న సిరిసిల్ల
• రంగారెడ్డి
• సంగారెడ్డి
• సిద్ధిపేట
• సూర్యాపేట
• వికారాబాద్
• వనపర్తి
• వరంగల్
• యాదాద్రి భువనగిరి
• జాతీయం
• ప్రభుత్వం
• పార్లమెంట్
• సుప్రీంకోర్టు
• హైకోర్టులు
• ఎన్నికలు
• విధానాలు
• పాలన
• అభివృద్ధి
• లోక్‌సభ
• రాజ్యసభ
• రాష్ట్రపతి
• ఉపరాష్ట్రపతి
• ప్రధానమంత్రి
• కేంద్ర మంత్రివర్గం
• ఎన్నికల సంఘం
• ప్రభుత్వ పథకాలు
• బడ్జెట్
• రైల్వేలు
• సరిహద్దులు
• విదేశాంగం
• వాతావరణం
• విపత్తులు
• జాతీయ భద్రత
• అంతర్జాతీయం
• అమెరికా
• యూరప్
• ఆసియా
• మధ్యప్రాచ్యం
• గల్ఫ్
• చైనా
• రష్యా
• పాకిస్థాన్
• శ్రీలంక
• బంగ్లాదేశ్
• జపాన్
• ఆస్ట్రేలియా
• ప్రపంచం
• ఉత్తర అమెరికా
• దక్షిణ అమెరికా
• ఆఫ్రికా
• ఓషియానియా
• యునైటెడ్ కింగ్‌డమ్
• శ్రీలంక
• నేపాల్
• భూటాన్
• ఆఫ్ఘానిస్తాన్
• యుద్ధాలు & ఘర్షణలు
• దౌత్యం
• అంతర్జాతీయ సంబంధాలు
• ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
• వలసలు
• ప్రపంచ ఆరోగ్యం
• ఐక్యరాజ్యసమితి
• ప్రపంచ వాతావరణం
• రాజకీయాలు
• ఆంధ్ర రాజకీయాలు
• తెలంగాణ రాజకీయాలు
• జాతీయ రాజకీయాలు
• రాజకీయ పార్టీలు
• ఎన్నికల వార్తలు
• రాజకీయ విశ్లేషణ
• ప్రచారం
• మేనిఫెస్టోలు
• క్రైమ్
• క్రైమ్ వార్తలు
• హత్యలు
• దొంగతనాలు
• మోసాలు
• సైబర్ క్రైమ్
• మాదకద్రవ్యాలు
• పోలీస్ వార్తలు
• కోర్టు వార్తలు
• CBI
• ED
• NIA
• బిజినెస్
• ఆర్థికం
• స్టాక్ మార్కెట్
• షేర్ మార్కెట్
• బ్యాంకింగ్
• బీమా
• స్టార్టప్‌లు
• పరిశ్రమలు
• కార్పొరేట్ వార్తలు
• MSME
• రియల్ ఎస్టేట్
• పన్నులు
• GST
• ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
© 2026 PNB News. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
అంతర్జాతీయంరాజకీయాలు

అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?

One News Desk
One News Desk
03-11-2026
షేర్ చేయండి
అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
షేర్ చేయండి

US Midterm Elections: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటే ఏంటి? ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? భారత్‌కు వీటితో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అమల్లో ఉంది. కానీ అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించారు. అవి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థకు అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, దేశ పరిపాలన నిర్వహించడం ఈ వ్యవస్థ బాధ్యత. శాసన వ్యవస్థను కాంగ్రెస్ అంటారు.

ఇందులో రెండు సభలు ఉంటాయి. అవే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్. ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ప్రతి రెండేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ఈ సభలో స్థానాలు కేటాయిస్తారు. అందుకే కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఉంటాయి. ఇక సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున సెనేటర్లు ఎన్నికవుతారు. వీరి పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకు సెనేట్‌లో మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విభాగమైన న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టుతో పాటు ఇతర ఫెడరల్ కోర్టులు ఉంటాయి. అమెరికాలో ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలంటే ముందుగా కాంగ్రెస్‌లోని రెండు సభలు ఆమోదించాలి. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తేనే అది చట్టంగా మారుతుంది. అంటే అధ్యక్షుడికి అన్ని అధికారాలు ఉండవు. కాంగ్రెస్, న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలవు.

అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు. ఈ పదవీకాలం మధ్యలో, అంటే రెండేళ్లు పూర్తయిన తర్వాత జరిగే ఎన్నికలనే మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటారు. ఇవి అధ్యక్ష ఎన్నికలు కాకపోయినా దేశ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సెనేట్‌లో 100 స్థానాలకు గాను సుమారు 33 లేదా 34 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు, స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

అమెరికాలో ప్రధానంగా రిపబ్లికన్, డెమోక్రటిక్ అనే రెండు పార్టీలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఈ పార్టీలు రాష్ట్రాల వారీగా ప్రైమరీలు లేదా కాకస్‌లను నిర్వహించి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎక్కువగా రాష్ట్రాలు, స్థానిక అధికారుల చేతుల్లో ఉంటుంది. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో ఓటరు నమోదు నిబంధనలు, ఓటింగ్ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్, ముందస్తు ఓటింగ్, ఎన్నికల రోజు నేరుగా ఓటు వేయడం వంటి అవకాశాలు ఉంటాయి. స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలు ఒకేసారి జరగడంతో ఒక్కో ప్రాంతంలో ఓటర్లకు వేర్వేరు బ్యాలెట్లు ఉంటాయి. అందుకే తుది ఫలితాలు వెల్లడవడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.

ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉంది. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉండగా, డెమోక్రాట్లకు 47 స్థానాలు ఉన్నాయి. సెనేట్‌పై పట్టు సాధించాలంటే డెమోక్రాట్లు కనీసం నాలుగు స్థానాలు అదనంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. టెక్సాస్, మైనే, ఒహియో, అలాస్కా వంటి రాష్ట్రాల్లో జరిగే పోటీ ఈ విషయంలో కీలకం కానుంది. మరోవైపు ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ల మెజారిటీ చాలా స్వల్పంగా ఉంది. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు తిరిగి సభపై పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

సాధారణంగా అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుంటుంది. గత 23 మిడ్‌టర్మ్ ఎన్నికలను పరిశీలిస్తే అధ్యక్షుడి పార్టీ సగటున ప్రతినిధుల సభలో 27 స్థానాలు, సెనేట్‌లో మూడు స్థానాలు కోల్పోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ధరల పెరుగుదల, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) ద్వారా భారీగా ఉద్యోగాల కోతలు చేపట్టారు. సుమారు 2.64 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు, హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఎదురైన అంతరాయాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు, చైనాపై భారీ టారిఫ్‌లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాలన్నీ ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి.

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ నిలబెట్టుకుంటే అధ్యక్షుడు ట్రంప్‌కు తన విధానాలను అమలు చేయడం సులభమవుతుంది. కొత్త చట్టాల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం వంటి విషయాల్లో ఆయన ప్రభుత్వానికి ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభపై పట్టు సాధిస్తే పరిస్థితులు మారిపోతాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం వారికి లభిస్తుంది. ముఖ్యంగా వాణిజ్య సుంకాలు, విదేశాంగ విధానాలు, యుద్ధ నిర్ణయాలు, ప్రభుత్వ ఖర్చులపై విచారణలు చేపట్టవచ్చు. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

అంతేకాదు, ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారం కూడా డెమోక్రాట్లకు ఉంటుంది. అయితే అభిశంసన తీర్మానం ఆమోదం పొందడం, అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. ప్రతినిధుల సభ అభిశంసనకు ఆమోదం తెలిపినా, సెనేట్‌లో విచారణ జరగాలి. అధ్యక్షుడిని దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. అందువల్ల ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనేది ట్రంప్ మిగిలిన రెండేళ్ల పాలనకు చాలా కీలకం. ఎన్నికల ఫలితాలు 2028లో జరిగే తదుపరి అధ్యక్ష ఎన్నికల వరకు అమెరికా ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపనున్నాయి.

అమెరికా తీసుకునే వాణిజ్య, విదేశాంగ, రక్షణ నిర్ణయాలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు, హెచ్-1బీ వీసాలు, దిగుమతి సుంకాలు, రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం వంటి అంశాలు కీలకంగా మారాయి. అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త దరఖాస్తులపై భారీగా ఫీజులు విధించడం భారతీయ నిపుణులు, ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల వాటా 70 శాతానికి పైగా ఉండటంతో ఈ నిర్ణయాలు మన దేశానికి ముఖ్యమైనవిగా మారాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారత ఐటీ సేవల రంగానికి కూడా ఇది సవాలుగా మారింది.

వాణిజ్య రంగంలోనూ భారత్‌కు అమెరికాతో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో 2025లో భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలతో 2026లో తాత్కాలికంగా 18 శాతానికి త‌గ్గించింది. అయితే ఈ విషయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, పరస్పర ప్రయోజనాలు కీలకంగా ఉంటాయి. మరోవైపు రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్, అమెరికా సంబంధాలు బలపడుతున్నాయి. చైనా సెమీకండక్టర్ రంగంలో ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం, కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా TRUST (ట్రాన్స్‌ఫార్మింగ్ రిలేష‌న్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాట‌జిక్ టెక్నాల‌జీ) కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రతినిధుల సభపై పట్టు సాధిస్తే ట్రంప్ ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలు, విదేశాంగ విధానాలపై మరింత పర్యవేక్షణ ఉండవచ్చు. దీంతో భారత ఎగుమతిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలకు రెండు పార్టీల నుంచి కూడా మద్దతు ఉండటంతో సుంకాల విషయంలో పూర్తిస్థాయి మార్పులు వస్తాయని చెప్పలేం.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అమెరికాఉంటాయిఎన్నికలుఎన్నికల్ట్రంప్పార్టీప్రతినిధులమిడ్వ్యవస్థసెనేట్
మునుపటి కథనం రిటైర్డ్ న్యాయమూర్తులకు తిరిగి విధుల్లో అవకాశం? రిటైర్డ్ న్యాయమూర్తులకు తిరిగి విధుల్లో అవకాశం?
తదుపరి కథనం Amla Side Effects:  ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.! Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!

ముఖ్యాంశాలు

యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యువతను కాపాడుకోవాలి.. డ్రగ్స్‌ వెనుక విదేశీ కుట్రలు.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
21-11-2026
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
21-11-2026
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
21-11-2026
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!
21-11-2026
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
Amit Shah | ఆ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌శ్న‌లు న‌వ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
21-11-2026
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 33W ఛార్జింగ్!
21-11-2026

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్
• క్రీడలు
• వినోదం
• ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?
అంతర్జాతీయం

Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?

19-10-2026
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? వామ్మో.. అసలు సీక్రెట్ ఇక్కడ ఉందా..
అంతర్జాతీయం

డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? వామ్మో.. అసలు సీక్రెట్ ఇక్కడ ఉందా..

19-11-2026

Italy-Social-Media-Ban-Children-Under-13 | పిల్లలకు సోషల్ మీడియా షాక్‌.. 13 ఏళ్లలోపు ఖాతాలపై నిషేధం!

19-11-2026
తాజ్‌మహల్‌ సందర్శనకు పాక్‌ మంత్రికి అనుమతి
రాజకీయాలు

తాజ్‌మహల్‌ సందర్శనకు పాక్‌ మంత్రికి అనుమతి

20-11-2026
PNB News

PNB News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@pnbnews.in

విభాగాలు

• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• జాతీయం
• అంతర్జాతీయం
• ప్రపంచం
• రాజకీయాలు
• క్రైమ్
• బిజినెస్
• టెక్నాలజీ
• ఆటోమొబైల్

త్వరిత లింకులు

• మా గురించి
• మమ్మల్ని సంప్రదించండి
• సంపాదకీయ విధానం
• వాస్తవ పరిశీలన విధానం
• సవరణలు & వివరణల విధానం
• మాతో ప్రకటన ఇవ్వండి
• వార్తా సమాచారం పంపండి
• సైట్ మ్యాప్

చట్టపరమైన

• గోప్యతా విధానం
• సేవా నిబంధనలు
• నిరాకరణ ప్రకటన
• కుకీ విధానం
• కాపీరైట్ విధానం
• ఫిర్యాదుల పరిష్కార విధానం
• DMCA & తొలగింపు విధానం
• అందుబాటు ప్రకటన

© 2026 PNB News · pnbnews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Welcome Back!

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?